గంగమ్మ తల్లీ
భూలోక సుందరీ భువనములో నీవు!
రే పల్లె వనములో వేలిసినావు
ఎరుకుల తరపున వేగివచ్చియు నీవు
బందిరాకుల గుడిసె భ్రమచినావు
ఏడాదికొకసారి ఎచ్చు ఆహారంభు
నిత్య పూజల చేత నిలచినావు
చుట్టేడు సముద్రాలు చూడక పాలింతువు
జగమెల్ల ఎల్లేటి జగదాంబనీవు
తయ్యూరు పాయకట్టు తాండవమాడుతూ తరలినావు
ఆరిమాకుల పల్లె గ్రామమునందు-
అద్భుతముగా ఉన్నావు ఆరిమేణి
గంగమ్మ తల్లీ!
- చలపతి
No comments:
Post a Comment